పవన్ కల్యాణ్ కొత్త సినిమా నుంచి ఒకేసారి మూడు అప్డేట్స్?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Power Star Pawan Kalyan) అప్‌కమింగ్ సినిమాల్లో హరిహర వీరమల్లు(Hari Hara Veera Mallu) ఒకటి.

Update: 2025-04-01 15:15 GMT

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Power Star Pawan Kalyan) అప్‌కమింగ్ సినిమాల్లో హరిహర వీరమల్లు(Hari Hara Veera Mallu) ఒకటి. ఈ సినిమాను కొంతభాగం క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi) పూర్తి చేయగా.. మిగిలిన భాగాన్ని నిర్మాత ఏఎమ్ రత్నం(AM Rathnam) కుమారుడు జ్యోతికృష్ణ(Jyothy Krishna) పూర్తి చేస్తున్నారు. వచ్చే మే 9వ తేదీన విడుదల చేయడమే లక్ష్యంగా శరవేగంగా షూటింగ్ పనులు పూర్తి చేస్తున్నారు. దాదాపు 98 శాతం షూటింగ్ పూర్తి కాగా, పవన్ కల్యాణ్‌కు సంబంధించిన కొన్ని సీన్లు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయట.

అయితే.. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒకేసారి ఈ చిత్రం నుంచి మూడు అప్డేట్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 14వ తేదీ నుంచి పవన్ కల్యాణ్ షూటింగ్‌లో పాల్గొంటున్నాడని.. పూర్తిచేసే బయటకు వస్తారని తెలుస్తోంది. దాంతోపాటు ఏప్రిల్ 10వ తేదీన హరిహర వీరమల్లు నుంచి మూడో పాట కూడా రిలీజ్ కాబోతుందట. నాలుగో పాటను ఏప్రిల్ 15వ తేదీన విడుదల చేసేందుకు సన్నాహాలు సైతం చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ.. ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ తెగ సంబురపడిపోతున్నారు.

కాగా, పాన్ ఇండియా లెవెల్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాను భారీ చిత్రాల నిర్మాత ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్(Nidhi Agarwal) హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్(Bobby Deol) ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. హరిహర వీరమల్లుతో పాటు యంగ్ డైరెక్టర్ సుజిత్‌తో ఓజీ, హరీశ్ శంకర్‌తో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాల్లో పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్నారు.

Click For Twitter Post..

Tags:    

Similar News