NTR: రజినీకాంత్ డైరెక్టర్‌తో ఎన్టీఆర్ సినిమా.. నెట్టింట హైప్ పెంచేస్తున్న న్యూస్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) ప్రస్తుతం ‘వార్-2’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.

Update: 2025-04-05 15:19 GMT

దిశ, సినిమా: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) ప్రస్తుతం ‘వార్-2’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ (Hrithik Roshan) హీరోగా నటిస్తున్న ఈ మూవీలో ఎన్టీఆర్ కీలకమైన పాత్రలో నటిస్తున్నాడు. అయాన్ ముఖేర్జీ (Ayan Mukherjee) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ సమ్మర్ స్పెషల‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఇక ఈ మూవీ అనంతరం ఎన్టీఆర్ ‘దేవర్ పార్ట్ 2’ షూటింగ్‌లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. అలాగే.. స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌(Prashant Neel)తో కూడా ఓ ప్రాజెక్ట్ చేస్తున్నాడు ఎన్టీఆర్.

ఇదిలా ఉంటే.. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్టీఆర్ తన తదుపరి చిత్రంపై ఇన్‌డైరెక్ట్ హింట్ (Indirect hint) ఇచ్చాడు. సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) ‘జైలర్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్‌(Nelson Dilipkumar)తో తప తదుపరి పెద్ద ప్రాజెక్ట్ ఉండబోతున్నట్లు సూచనప్రాయంగా చెప్పాడు ఎన్టీఆర్. ఇక ఈ మూవీకి నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుండగా.. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నట్లు తెలుస్తుంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని టాక్. కాగా.. వార్ 2, దేవర 2, ప్రశాంత్ నీల్ సినిమాతో పాటు ఇప్పుడు నెల్సన్‌తో సినిమాకు ఎన్టీఆర్ సిద్ధం అవ్వడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News