Pawan Kalyan: కొన్ని కొన్ని టచ్ చెయ్యకూడదు.. పవన్ కల్యాణ్ సినిమా రీరిలీజ్‌పై నిర్మాత షాకింగ్ కామెంట్స్
ప్రజెంట్ ఇండస్ట్రీ(Industry)లో రీరిలజ్ ట్రెండ్ నడుస్తుంది.

దిశ, సినిమా: ప్రజెంట్ ఇండస్ట్రీ(Industry)లో రీరిలజ్ ట్రెండ్ నడుస్తుంది. ఒకప్పుడు రిలీజై పెద్దగా సక్సెస్ అందుకోని సినిమాలు కూడా ఇప్పుడు రీ రిలీజై మంచి హిట్ అందుకోవడంతో పాటు.. కలెక్షన్లు కూడా భారీగానే వసూళ్లు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిర్మాత నాగవంశి (Naga Vamsi), పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ‘అజ్ఞాతవాసి’ (Agnyaathavaasi) రీరిలీజ్‌పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ‘ఫస్ట్ రిలీజ్‌లో ఆడని సినిమాలు కూడా రీరిలీజ్‌లో బాగా ఆడుతున్నాయి.. ప్లాప్ సినిమాని కూడా ఇది క్లాసిక్ కదా అన్నట్లు చూస్తున్నారు’ అని నాగవంశిని యాంకర్ ప్రశ్నించగా.. ‘మ్యూజిక్ సపోర్ట్ (Music support) చేసే సినిమాలు అన్ని రీ రిలీజ్(re-release)లో హిట్‌గా నిలిచాయి. పాటలు బాగున్న సినిమాలో రీరిలీజ్‌లో హిట్ అందుకున్నాయి అని అనుకుంటున్నా’ అన్నారు. ‘మరి అజ్ఞాతవాసి సినిమాను రీరిలీజ్ చెయోచ్చు కదా’ అనే ప్రశ్నపై నాగవంశి స్పందిస్తూ.. ‘వద్దులేండి.. కొన్ని కొన్ని టచ్ చెయ్యకూడదు’ అని చెప్పుకొచ్చాడు.