Adah Sharma: బాక్సాఫీస్ నెంబర్ల్ లెక్కపెట్టుకుంటే అంతే ఇక.. కలెక్షన్లపై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

‘హార్ట్ ఎటాక్’ (Heart Attack) సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అదా శర్మ (Adah Sharma)..

Update: 2025-03-24 14:56 GMT
Adah Sharma: బాక్సాఫీస్ నెంబర్ల్ లెక్కపెట్టుకుంటే అంతే ఇక.. కలెక్షన్లపై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
  • whatsapp icon

దిశ, సినిమా: ‘హార్ట్ ఎటాక్’ (Heart Attack) సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అదా శర్మ (Adah Sharma).. అనతి కాలంలోనే మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. దీంతో భాషతో సంబంధం లేకుండా హిందీ, కన్నడ, తమిళంలో వరుస సినిమాలు చేస్తూ సందడి చేస్తుంది. అంతే కాకుండా.. ‘కేరళ స్టోరీ’ (Kerala Story) సినిమాలతో మాత్రం పాన్ ఇండియా (Pan India) రేంజ్‌లో పాపులారిటీ తెచ్చుకుంది. ఇక దాని తర్వాత వచ్చిన ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’ అంతగా ఆకట్టుకోలేకపోయింది. రిలీజ్‌కు ముందుకు ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండగా.. రిలీజ్ తర్వాత మాత్రం అనుకున్నస్థాయిలో ప్రేక్షకాదరణను సొంతం చేసుకోలేకపోయింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూ (Interview)లో పాల్గొన్న ఈ బ్యూటీ.. ఈ సినిమా ఫెయిల్యూర్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

‘మంచి సినిమాను ప్రేక్షకులకు అందిస్తున్నామా, లేదా అనేది చూస్తాను. నాకు వచ్చిన పాత్రకు వంద శాతం న్యాయం చేస్తున్నానా, లేదా అనేది ఆలోచిస్తాను. అలాగే ఆ పాత్రకు ప్రేక్షకులు ఎంతవరకు కనెక్ట్ (Connect) అయ్యారు అనేది చూసుకుంటాను. అంతేకానీ బాక్సాఫీస్ నంబర్లపై దృష్టి పెట్టను. వాటిపై దృష్టి పెడితే సరిగ్గా నటించలేను. మేం ‘ది కేరళ స్టోరీ’ సినిమా తీసినప్పుడు.. ఆ సినిమా అంత పెద్ద హిట్ అవుతుందని ఊహించలేదు. లేడీ ఓరియంటెడ్ (Lady oriented) మూవీ అయినప్పటికీ రూ. 378 కోట్లు వసూళ్లు రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది. ఆ సినిమాలో నటించినప్పుడు కూడా నేను బాక్సాఫీస్ కలెక్షన్ల గురించి ఆలోచించలేదు. అప్పుడు కూడా నా పాత్ర ఎంత వరకు రీచ్ అవుతోంది.. ఎలా చేస్తున్నాను అనేది మాత్రమే చూశాను’ అని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.

Tags:    

Similar News