మీరు ఏ విషయానికి బాగా భయపడతారంటూ నెటిజన్ క్వశ్చన్.. రష్మిక మందన్న ఆన్సర్ ఇదే..(పోస్ట్)

నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది.

Update: 2025-03-27 09:31 GMT
మీరు ఏ విషయానికి బాగా భయపడతారంటూ నెటిజన్ క్వశ్చన్.. రష్మిక మందన్న ఆన్సర్ ఇదే..(పోస్ట్)
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. అందులో ఆమె నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సికిందర్’(Sikindar). ఏఆర్ మురుగదాస్(AR Murugadoss) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్(Salman Khan) హీరోగా నటిస్తున్నాడు. అలాగే కాజల్ అగర్వాల్(Kajal Agarwal) కీ రోల్ ప్లే చేస్తుంది. కాగా ఈ మూవీ భారీ అంచనాల నడుమ మార్చి 30న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ప్రస్తుతం మూవీ టీమ్ ప్రమోషన్ల జోరులో ఉన్నారు. ఈ క్రమంలో రష్మిక మందన్న పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

తాజాగా రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్(Instagram) వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. అందులో నేను ఏదైనా మిస్ అయ్యానా..? చెప్పండి చెప్పండి అంటూ ఓ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ క్విజ్ పెట్టింది. అందులో చాలామంది రకరకాల ప్రశ్నలు అడిగారు. ఇందులో భాగంగా ఓ నెటిజన్.. ‘మీరు ఎక్కువగా దేనికి భయపడతారు అని అడుగగా.. దానికి రష్మిక ‘హుమ్.. నాకు బాగా ఎత్తుగా లేదా లోతుగా ఉన్న నీళ్లను చూస్తే చాలా భయం వేస్తుంది’ అని ఏడుస్తున్న ఎమోజీ పెట్టింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.


Tags:    

Similar News