కండల వీరుడికి రష్మిక మందన్న లిప్ కిస్.. ఫొటోలు వైరల్ !
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ( Rashmika Mandanna ) ప్రస్తుతం బాలీవుడ్ లో ( Bollywood ) ఫుల్ బిజీగా గడుపుతోంది.

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ( Rashmika Mandanna ) ప్రస్తుతం బాలీవుడ్ లో ( Bollywood ) ఫుల్ బిజీగా గడుపుతోంది. టాలీవుడ్ ( Tollywood ) ఇండస్ట్రీ కంటే ఆమెకు బాలీవుడ్ లోనే ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. యానిమల్ ( Animal Movie) లాంటి బంపర్ హిట్ సినిమా అందుకున్న తర్వాత ఏకంగా సల్మాన్ ఖాన్ (Salman Khan) సినిమాలో అవకాశం దక్కించుకుంది రష్మిక. సల్మాన్ ఖాన్ అలాగే రష్మిక ఇద్దరూ సికిందర్ సినిమాలో ( Sikandar ) నటించారు. ఈ సినిమా మార్చి 30వ తేదీన రిలీజ్ కాబోతోంది. ఈ తరుణంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్.. చక చక నిర్వహిస్తోంది విచిత్ర బృందం.
ఇందులో భాగంగానే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్, ఫ్రీ రిలీజ్ ఈవెంట్లు కూడా నిర్వహించారు. ఇక ప్రమోషన్ లో భాగంగా... సల్మాన్ ఖాన్ అలాగే రష్మిక మందన్న ఒకే స్టేజిపై మెరిశారు. ఈ సందర్భంగా ఈ ఇద్దరు మధ్య... ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఒకరినొకరు కాస్త రొమాంటిక్ గా చూసుకోవడం, రష్మిక పై సల్మాన్ చెయ్యి వేసిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఇక మరి కొంతమంది అయితే ఏఐ టెక్నాలజీ వాడుకొని... సల్మాన్ ఖాన్ కు రష్మిక మందన్న లిప్ కిస్ పెట్టినట్లు ఫోటోలు, వీడియోలు క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు అలాగే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో నిజంగానే రష్మిక మందన్న కిస్ పెట్టినట్లు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.