IPL-2025: కేకేఆర్ టీమ్‌కు షారుఖ్ ఖాన్ కీలక సందేశం
ఐపీఎల్-2025(IPL 2025) సీజన్ మరికాసేపట్లో ప్రారంభం కాబోతోంది.

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్-2025(IPL 2025) సీజన్ మరికాసేపట్లో ప్రారంభం కాబోతోంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్(Eden Gardens) మైదానం ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌కు వేదికైంది. ఇవాళ రాత్రి 7:30 గంటలకు కోల్‌కతా నైట్ రైజర్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరుగబోతోంది. ఈ నేపథ్యంలో కోల్‌కతా జట్టుకు.. ఆ టీమ్ ఓనర్, బాలీవుడ్(Bollywood) కింగ్ ఖాన్ షారుఖ్(Shah Rukh Khan) కీలక సందేశం ఇచ్చారు. ఇవాళ కేకేఆర్ డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లారు. జట్టు సభ్యులతో సరదాగా ముచ్చటించారు. ‘మీ అందరికీ దేవుడి ఆశీస్సులు ఉన్నాయి. మీరంతా ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలి. జట్టులో కొత్తగా చేరిన వారికి ఆల్ ద బెస్ట్’ అని షారుఖ్ చెప్పారు.
ఇదిలా ఉండగా.. ఇవాళ్టి తొలి మ్యాచ్‌కి వరుణుడు అడ్డంకిగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచనలు చేసింది. మ్యాచ్ రద్దు అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఒకవేళ మ్యాచ్ రద్దు అయితే.. కేకేఆర్, ఆర్సీబీ జట్లకు చెరో పాయింట్‌ను కేటాయిస్తారు. ఎందుకంటే లీగ్ మ్యాచ్‌లకు రిజర్వ్ డే ఉండదు. ఇకపోతే ఈ మ్యాచ్ రద్దైతే ఏ జట్టుకు లాభమో, ఏ జట్టుకు నష్టమో చెప్పడం కష్టం. ఏదీ ఏమైనా ప్రస్తుతం మ్యాచ్ సజావుగా సాగాలని ప్రతీ క్రీడాభిమాని కోరుకుంటున్నారు.
కేకేఆర్ జట్టు :
సునీల్ నరైన్, క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), అజింక్య రహానే (కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, అంగ్క్రిష్ రఘువంశీ, రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణ్‌దీప్ సింగ్, స్పెన్సర్ జాన్సన్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి.