ఆ హీరోతో డేటింగ్ చేయోద్దని కండీషన్ పెట్టారు.. నిధి అగర్వాల్ షాకింగ్ కామెంట్స్

యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్(Nidhi Agarwal) ప్రజెంట్ ‘ది రాజాసాబ్’(The Rajasaab), ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu)వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది.

Update: 2025-03-22 11:36 GMT
ఆ హీరోతో డేటింగ్ చేయోద్దని కండీషన్ పెట్టారు.. నిధి అగర్వాల్ షాకింగ్ కామెంట్స్
  • whatsapp icon

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్(Nidhi Agarwal) ప్రజెంట్ ‘ది రాజాసాబ్’(The Rajasaab), ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu)వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. ఈ రెండు సినిమాల షూటింగ్స్‌లో ఒకేసారి పాల్గొంటూ బిజీ బిజీగా గడుపుతోంది. అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ షూటింగ్ స్పాట్స్ నుంచి పలు ఫొటోలు షేర్ చేస్తూ అభిమానులను కవ్విస్తుంటోంది. ఇక ఈ మధ్య కాలంలో గ్లామర్ డోస్ పెంచేసిన ఈ బ్యూటీ ట్రెండీ ట్రెండీ డ్రెస్సులు ధరిస్తూ ఫ్యాన్స్‌కు అందాల విందును ఏర్పాటు చేస్తూ.. ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిధి అగర్వాల్ తన ఫస్ట్ సినిమా అగ్రిమెంట్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది.

‘నా సినీ కెరీర్ బాలీవుడ్ చిత్రం ‘మున్నా మైకేల్’(Munna Michael)తో స్టార్ట్ అయింది. ఈ సినిమాలో టైగర్ ష్రాఫ్ హీరోగా నటించారు. ఈ మూవీకి నేను ఓకే చేశాక.. చిత్ర బృందం నాతో ఓ అగ్రిమెంట్‌పై సైన్ చేయించుకున్నారు. అందులో సినిమాకు సంబంధించి నేను పాటించాల్సిన కొన్ని నియమాలతో పాటు.. ‘నో డేటింగ్’(No dating) అనే కండిషన్ కూడా ఉంది. సినిమా రన్నింగ్‌లో ఉండగా.. హీరోతో నేను డేటింగ్ చెయ్యకూడదు అనేది దాని అర్థం. అయితే.. అప్పుడు నేను దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు. కానీ, తర్వాత నాకు ఆ విషయం తెలిసి షాక్ అయ్యాను. సినిమా టైమ్‌లో హీరోహీరోయిన్ ప్రేమలో పడితే సినిమాపై దృష్టి పెట్టకుండా ఉంటారని వారు అలా సైన్ చేయించుకున్నారు. అది తెలిసిన తర్వాత ఇలాంటి షరతులు కూడా పెడతారా అనిపించింది’ అంటూ చెప్పుకొచ్చింది.

Full View

Tags:    

Similar News