Kalyan Ram: అర్జున్ S/O వైజయంతి నుంచి అప్‌డేట్.. మునుపెన్నడు చూడని మాస్ డాన్స్ రాబోతుందంటూ పోస్ట్

నందమూరి కళ్యాణ్ రామ్ (Kalyan Ram) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో దూసుకుపోతున్నారు.

Update: 2025-03-28 15:05 GMT

దిశ, సినిమా: నందమూరి కళ్యాణ్ రామ్ (Kalyan Ram) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో దూసుకుపోతున్నారు. ఇందులో ‘అర్జున్ S/O వైజయంతి’ (Arjun S/O Vyjayanthi) ఒకటి. ప్రదీప్ చిలుకూరి (Pradeep Chilukuri) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నుంచి ఇప్పటికే వచ్చిన టీజర్ (Teaser) ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందులో విజయశాంతి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించగా.. కళ్యాణ్ రామ్ అమ్మ అంటే ప్రాణం ఇచ్చే కొడుకు పాత్రలో మెప్పించాడు. ఇక టీజర్‌తో సినిమాపై భారీ హైప్ క్రియేట్ కాగా.. తాజాగా ఫస్ట్ సింగిల్ (First single) అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్.

ఈ మేరకు ‘ఇంతకు ముందెన్నడూ చూడని ఉత్సాహభరితమైన, మాస్ డ్యాన్స్‌తో నందమూరి కళ్యాణ్ రామ్ వచ్చేస్తున్నాడు. అర్జున్ అర్జున్ S/O వైజయంతి నుంచి ఫస్ట్ సింగిల్ ‘నయాల్ది’ మార్చి 31న విడుదల అవుతుంది.. త్వరలో థియేటర్లలో కలుద్దాం’ అంటూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో కళ్యాణ్ రామ్ మాస్ స్టెప్‌(Mass step)తో కనిపించి మెప్పించాడు. కాగా.. ఈ సినిమాలో సాయి మంజ్రేకర్ (Sai Manjrekar) హీరోయిన్‌గా నటిస్తుండగా.. సీనియర్ హీరోయిన్ విజయశాంతి (Vijayashanti), సోహెల్ ఖాన్, శ్రీకాంత్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్న ఈ మూవీకి ‘కాంతార’ ఫేమ్ అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నారు.

Tags:    

Similar News