రోడ్లపై ఖాళీగా తిరుగుతున్న టాలీవుడ్ స్టార్ హీరో.. రాజ్యం పోయాక రోడ్డు మీద వదిలేశారా అంటూ కామెంట్స్ (వీడియో)
ఒకప్పుడు స్టార్ హీరోగా ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు జగపతి బాబు(Jagapathi Babu).

దిశ, సినిమా: ఒకప్పుడు స్టార్ హీరోగా ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు జగపతి బాబు(Jagapathi Babu). ఫ్యామిలీ హీరోగా క్రేజ్ ఉన్న ఈయన.. ప్రజెంట్ విలన్‌గా మారి సంచలనం సృష్టిస్తున్నాడు. రామ్ చరణ్(Ram Charan) ‘రంగస్థలం’ చిత్రంలో విలన్‌గా నటించి ప్రేక్షకులను మెప్పించిన ఈ నటుడు.. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నాడు. అలాగే నిత్యం సోషల్ మీడియాలో బిజీగా ఉంటూ.. ఏదో ఒక పోస్ట్‌తో అలరిస్తుంటాడు. ఇందులో భాగంగానే తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా.. ఓ వీడియో పోస్ట్ చేశాడు. ‘నా ప్రయాణం బ్లాక్ అండ్ వైట్‌లోకి అని మీకు తెలియజేస్తున్నా’ అనే క్యా్ప్షన్ ఇచ్చి షేర్ చేసిన వీడియోలో.. జగపతి బాబు ఓ నార్మల్ పర్శన్‌లా చాలా సింపుల్‌గా రోడ్‌పై ఒక్కడే నడుచుకుంటూ తిరుగుతున్నాడు. ఓ సెల్ ఫోన్ షాప్‌కు అలాగే నడుచుకుంటూ వెళ్లగా కొంత మంది గుర్తుపట్టారు.. మరికొందరు మాత్రం అస్సలు పట్టించుకోలేదు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో.. ‘ఇది మీరా ఎవరో అనుకున్నా.. మరి ఇంత సింపుల్‌గా ఉన్నారేంటీ’ అని ‘రాజ్యం పోయాక రోడ్డు మీద వదిలేశారా’ అంటూ రకరకాలుగా స్పందిస్తున్నారు నెటిజన్లు.