ట్రాన్స్ గర్ల్‌కు శారీ ఫంక్షన్.. బిడ్డపై ప్రేమను చాటుకున్న తల్లిదండ్రులు
దిశ, ఫీచర్స్ : ట్రాన్స్‌జెండర్లు కనబడితేనే ముఖం చిట్లించుకుని చూపు తిప్పుకునే latest telugu news..
దిశ, ఫీచర్స్ : ట్రాన్స్‌జెండర్లు కనబడితేనే ముఖం చిట్లించుకుని చూపు తిప్పుకునే పరిస్థితుల నుంచి సొసైటీ దృక్పథంలో గుర్తించదగ్గ మార్పు కనిపిస్తుంది. అన్నింటికన్నా మించి పిల్లల ఒరిజినల్ ఐడెంటిటీ విషయంలో తల్లిదండ్రుల వైఖరి మారుతోంది. ఇదే క్రమంలో తమిళనాడుకు చెందిన ఓ ట్రాన్స్ గర్ల్ పేరెంట్స్ యుక్తవయసుకు వచ్చిన తమ కూతురుకు ఘనంగా వేడుక నిర్వహించి మూస పద్ధతులకు స్వస్తి పలికారు. ఈ శుభకార్యానికి ఇరుగు పొరుగు తో పాటు బంధువులు కూడా హాజరై అమ్మాయిని ఆశీర్వదించడం విశేషం. తమిళనాడు, కడలూరు జిల్లా, విరుదాచలం కు చెందిన కొలంచి - అముత దంపతులు.. తమ 21 ఏళ్ల ట్రాన్స్ గర్ల్ నిషా(నిషాంత్)కు సారీ ఫంక్షన్ నిర్వహించారు.
క్యాటరింగ్‌లో డిప్లొమా పూర్తి చేసిన నిషాంత్.. తనలో అమ్మాయి ఫీలింగ్స్ ఉన్నాయని తల్లిదండ్రులకు చెప్పినప్పుడు కొట్టడంతో పాటు తీరు మార్చుకోవాలని బాధపెట్టారు. దీంతో ఇంటి నుంచి పారిపోయి లింగమార్పిడి వ్యక్తుల దగ్గర ఆశ్రయం పొందారు. అయితే కొన్ని రోజుల తర్వాత తన అంకుల్.. ఆమె పేరెంట్స్‌కు పరిస్థితిని వివరించడంతో రియలైజ్ అయ్యారు. నిషా బాడీ లాంగ్వేజ్, ఎమోషన్స్‌కు రెస్పెక్ట్ ఇస్తూ తనను తానుగా యాక్సెప్ట్ చేసి ఇంటికి తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే తనకు ఫంక్షన్ చేసి ప్రేమను చాటుకున్నారు. కూరగాయలు అమ్ముతున్న నిషా తండ్రి, శానిటేషన్ వర్కర్ అయిన తల్లి.. తమ బిడ్డకు ఎప్పటికీ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.