బాలిక ఆచూకీ కోసం ప్రత్యేక గాలింపు చర్యలు

9 సంవత్సరాల బాలిక అదృశ్యమైన ఘటన తెలిసిందే. కరన్ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి బాలిక ఆచూకీ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.

Update: 2024-11-26 16:18 GMT

దిశ, తాండూరు రూరల్ (తాండూరు ) : 9 సంవత్సరాల బాలిక అదృశ్యమైన ఘటన తెలిసిందే. కరన్ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి బాలిక ఆచూకీ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. తాండూరు మండలం కరణ్ కోట్ గ్రామానికి చెందిన బక్క లాలమ్మ అనే మహిళా మనమరాలు బక్క స్వాతి ఈ నెల 22 న కిరాణా దుకాణానికి వెళ్లి వస్తానంటూ ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాలేదని 24న కరన్ కోట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు ఎస్సై విఠల్ రెడ్డి వెల్లడించారు. తప్పిపోయిన బాలిక విషయంపై వచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన ఎస్ఐ విఠల్ రెడ్డి కరణ్ కోట్ పోలీస్ లతో రెండు బృందాలుగా ఏర్పడి చేసిన విచారణ అనంతరం తప్పిపోయిన బాలిక తాండూరు పట్టణ ప్రాంతానికి చేరుకున్నట్లు తెలిపారు.

22న ఉదయం 10 గంటలకు మిస్సింగ్ అయిన పాప స్వాతి తనంతట తానుగా కర్ణాటక నుంచి వచ్చే ఆర్టీసీ బస్సు నెంబర్ ఎ 32ఎఫ్ 1915 లో ఎక్కి తాండూరు పట్టణం మల్లప్ప మడిగ అనే ప్రాంతంలో దిగినదని ఆర్టీసీ బస్సు కండక్టర్ ద్వారా సమాచారం తెలిసిందని ఎస్సై వివరించారు. బాలిక అదృశ్యం పై సీరియస్ గా తీసుకున్న ఎస్ఐ విఠల్ రెడ్డి మిస్సింగ్ అయిన పాప స్వాతిని ఎవరైనా తీసుకెళ్లారా లేక అడ్రస్ తెలియక తాండూర్ పట్టణంలో తిరుగుతుందా అనే దానిపై ఆరా తిస్తున్నామన్నారు. ప్రస్తుతం అమ్మాయి స్వాతి తలపై వెంట్రుకలేని విధంగా (గుండుతో) ఉందని గుర్తు చేశారు. మిస్సింగ్ అయిన 9 ఏళ్ల బాలిక స్వాతి కనిపించినచో 8712670052, తాండూర్ డీస్పీ బాలకృష్ణారెడ్డి 8712670017లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు.


Similar News