ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైనది : జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్

ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైనదని, 18 సంవత్సరాలు పూర్తి అయిన ప్రతి ఒక్కరూ తప్పని సరిగా ఓటరుగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు.

Update: 2024-11-26 14:34 GMT

దిశ, ప్రతినిధి వికారాబాద్ : ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైనదని, 18 సంవత్సరాలు పూర్తి అయిన ప్రతి ఒక్కరూ తప్పని సరిగా ఓటరుగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. మంగళవారం భారత రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా ఓటరు అవగాహన కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ పట్టణం ఎన్నెపల్లి చౌరస్తా నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు ఏర్పాటు చేసిన 2కే రన్ ను అదనపు కలెక్టర్ సుదీర్, అసిస్టెంట్ కలెక్టర్ ఉమా హారతి లతో కలిసి జెండా ఊపి జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… స్పెషల్ సమ్మరి రివిజన్ 2025లో భాగంగా ఓటరు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఆయుధం లాంటిదని, ఆ ఆయుధాన్ని మన చేతుల్లో తీసుకోవాలంటే తప్పని సరిగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. ఓటు అనేది భారత రాజ్యాంగం కల్పించిన హక్కని అన్నారు. ఇందుకుగాను ప్రత్యేక వెబ్సైట్ ద్వారా ఎం ఆర్ ఓ, బిఎల్ఓ ల దగ్గర, ఆన్లైన్ ద్వారా ఓటు హక్కు నమోదు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమములో స్వీప్ నోడల్ అధికారి ఏం.ఎ సత్తార్, డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా అధికారులు, వివిధ శాఖల ఉద్యోగులు, కళాశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


Similar News