ఉరి వేసుకొని ఉత్తర్​ ప్రదేశ్​ వాసి మృతి

ఉరి వేసుకొని ఉత్తర్​ ప్రదేశ్​ వాసి మృతి చెందినట్లు పరిగి ఎస్​ఐ సంతోష్​ కుమార్​ తెలిపారు.

Update: 2024-11-26 14:29 GMT

దిశ, పరిగి : ఉరి వేసుకొని ఉత్తర్​ ప్రదేశ్​ వాసి మృతి చెందినట్లు పరిగి ఎస్​ఐ సంతోష్​ కుమార్​ తెలిపారు. ఉత్తర్​ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మోహిత్​ కుమార్​ (31) పరిగి మండలం మాదారం గ్రామంలోని పవన్​ ప్లైవుడ్​ ఫ్యాక్టరీలో 20 రోజులుగా దినసరి కూలీగా పనిచేసేందుకు వచ్చాడు. మోహిత్​ ఉత్తర్​ ప్రదేశ్​ లో ఉన్నప్పుడు ఓ మైనర్​ బాలిక కేసులో రెండేళ్లు జైలు శిక్ష అనుభవించి వచ్చాడు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవడంతో ఫ్లై వుడ్​ ఫ్యాక్టరీలో పని చేసేందుకు వచ్చాడు. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఎవరితో సరిగ్గా మాట్లాడకుండా ఉంటూ తాగుడుకు బానిస అయ్యాడు. ఇందులో భాగంగానే సోమవారం రాత్రి 9 గంటలకు మద్యం బాటిల్​ తెచ్చుకొని తాగాడు. మద్యం సేవించి ఎంత సేపటికి తలుపులు తెరవడం లేదంటూ తన తమ్ముడైన సాహిత్​​ కుమార్ కు అనుమానం వచ్చి చూడగా మోహిత్​ ఉరి వేసుకుని ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఫ్యాక్టరీ యాజమాన్యానికి, పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి తమ్ముడు సాహిత్​ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి స్వగ్రామానికి తరలించినట్లు ఎస్​ఐ సంతోష్​ కుమార్​ తెలిపారు.


Similar News