మానేరు ప్రాజెక్టులో దూకి యువకుడు ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టులో దూకి ఒక యువకుడు మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
దిశ,గంభీరావుపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టులో దూకి ఒక యువకుడు మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం వేల్పుగొండ గ్రామానికి చెందిన నందగిరి భరత్(31) అనే యువకుడు ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రాజెక్టు ఒడ్డున సెల్ ఫోన్, బట్టల ఆధారంగా కుటుంబీకులు భరత్ గా గుర్తించారు. యువకుని ఆత్మహత్యకు గల కారణాలు తెలియ రాలేదు. శవం ఆచూకీ కోసం రాత్రి వరకు గాలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. విషయం తెలుసుకున్న ఎస్ఐ శ్రీకాంత్ పోలీస్ సిబ్బందితో ప్రాజెక్టు వద్దకు వెళ్లి పరిశీలించారు.