వాటర్ హీటర్ తగిలి గృహిణి మృతి
వాటర్ హీటర్ తగిలి గృహిణి మరణించిన ఘటన మంగళవారం రోజు మండలంలోని హన్మంతాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది.
దిశ, నర్మెట : వాటర్ హీటర్ తగిలి గృహిణి మరణించిన ఘటన మంగళవారం రోజు మండలంలోని హన్మంతాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం మ్యాక రాజు గృహ ప్రవేశానికి బంధువు అయిన గుమ్మడివెల్లి గ్రామానికి చెందిన ఈరటి రాజేశ్వరి(32) భర్త బాలకృష్ణ వచ్చారు. వారి చిన్న కూతురు మధ్యాహ్నం వేల మల విసర్జన కోసం అదే ఇంటి వెనకాలకి రాజేశ్వరి తీసుకెళ్ళింది. తిరిగి వచ్చే క్రమంలో బాత్రూం బయట ఉన్న స్విచ్ బోర్డు కి వాటర్ హీటర్ ఉండగా ప్రమాదవశత్తు చెయ్యి నీటి బకెట్ లో పడగా షాక్ తగిలి చనిపోయింది. మృతురాలి భర్త బాలకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హెడ్ కానిస్టేబుల్ హీదాయత్ ఆలీ కేసు నమోదు చేశారు. మృతురాలికి ముగ్గురు ఆడపిల్లలు.