PM Modi : ఉగ్రవాద సంస్థలకు ప్రధాని మోడీ వార్నింగ్

తమ దేశ భద్రతను సవాలు చేసే ఉగ్రవాద సంస్థలకు ధీటుగా బదులిస్తామని ప్రధాని మోడీ అన్నారు.

Update: 2024-11-26 16:11 GMT

దిశ, నేషనల్ బ్యూరో : తమ దేశ భద్రతను సవాలు చేసే ఉగ్రవాద సంస్థలకు ధీటుగా బదులిస్తామని ప్రధాని మోడీ అన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సుప్రీంకోర్టులో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని పాల్గొని మాట్లాడారు. 2008లో ఇదే రోజు ముంబైలో తీవ్రవాదులు మారణహోమానికి పాల్పడ్డారని గుర్తు చేశారు. ఆ రోజు దేశ ప్రజలంతా చేసిన తీర్మాణానికి కట్టుబడి తీవ్రవాదంపై పోరు కొనసాగిస్తామన్నారు. తీవ్రవాదుల దాడుల్లో చనిపోయిన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నా అన్నారు. పౌరులకు ఈజ్ ఆఫ్ లివింగ్ కోసం తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. సీనియర్ సిటిజన్లు ఇంటి వద్దనే లైఫ్ సర్టిఫికెట్ పొందేలా చర్యలు తీసుకున్నామన్నారు. 70ఏళ్లు పైబడిన వారికి కూడా ఆయుష్మాన్ భారత్ స్కీం వర్తించేలా చర్యలు తీసుకున్నామని గుర్తు చేశారు. ఇందిరాగాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీ ఆనాడు రాజ్యాంగానికి సవాల్‌గా మారిందన్నారు. తమ ప్రభుత్వ హయాంలోనే 370 ఆర్టికల్‌ను రద్దు చేసినట్లు తెలిపారు. జమ్ము కశ్మీర్‌లో సైతం నేడు రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నారన్నారు. భారతదేశం చూస్తోన్న ఈ గణనీయమైన మార్పునకు రాజ్యాంగమే దిశానిర్దేశం చేస్తోందన్నారు. రాజ్యాంగం తమకు మార్గదర్శి అని.. రాజ్యాంగానికి, రాజ్యాంగ నిర్మాతలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా అని మోడీ అన్నారు

Tags:    

Similar News