Android Phones: ఆండ్రాయిడ్ ఫోన్లు వాడుతున్న వారికి కేంద్రం బిగ్ అలర్ట్..!

భారతదేశం(India)లో గత కొంత కాలంగా సైబర్ నేరగాళ్ల(Cyber criminals) బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతున్న విషయం తెలిసిందే.

Update: 2024-11-26 17:19 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారతదేశం(India)లో గత కొంత కాలంగా సైబర్ నేరగాళ్ల(Cyber criminals) బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా హ్యాకర్లు మొబైల్ యూజర్ల(Mobile Users)ను ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. చిన్న అవకాశం దొరికినా యూజ్ చేసుకొని వినియోగదారులపై సైబర్ అటాక్స్‌(Cyber ​​Attacks)కి తెగబడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆండ్రాయిడ్(Android) ఆపరేటింగ్ సిస్టమ్స్‌(OS) ఫోన్లు వాడుతున్న వారికి కేంద్ర ప్రభుత్వం(Central Govt) హెచ్చరికలు జారీ చేసింది. ఆండ్రాయిడ్ 12 నుంచి ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో చాలా సెక్యూరిటీ ప్రాబ్లమ్స్(Security Problems) ఉన్నాయని గుర్తించింది. ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ(E&IT) మంత్రిత్వశాఖ అనుబంధ సంస్థ 'ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(CERT-In)’ అడ్వైజరీని జారీ చేసింది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో లోపాలను హ్యాకర్లు గుర్తిస్తే యూజర్ల భద్రతకు తీవ్ర స్థాయిలో ముప్పు వాటిల్లే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేసింది. యూజర్ల ఫోన్లలో ఆండ్రాయిడ్ అప్డేట్స్(Android Updates) రాగానే వెంటనే అప్డేట్ చేసుకోవాలని సూచించింది.

Tags:    

Similar News