Chhota Rajan : ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన అండర్‌వరల్డ్ డాన్ చోటా రాజన్
తీహార్ జైలులో ఖైదీగా ఉన్న అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్‌ను శుక్రవారం ఢిల్లీ ఎయిమ్స్‌కు జైలు అధికారులు తరలించారు.
దిశ, నేషనల్ బ్యూరో : తీహార్ జైలులో ఖైదీగా ఉన్న అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్‌ను శుక్రవారం ఢిల్లీ ఎయిమ్స్‌కు జైలు అధికారులు తరలించారు. చోటా రాజన్‌కు ముక్కు సర్జరీ(సైనస్) చేయనున్నట్లు వైద్యులు తెలిపారు. చోటా రాజన్ అలియాస్ రాజేంద్ర సదాశివ్ నికల్జేను అక్టోబర్ 2015లో ఇండోనేషియా పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత బాలి నుంచి అతడిని పోలీసులు భారత్‌కు రప్పించారు. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు రైట్ హ్యాండ్‌గా ఉన్న చోటా రాజన్ మూడు దశాబ్ధాలుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరిగాడు. 2001లో హోటల్ వ్యాపారి జయశెట్టి హత్య కేసులో గతేడాది మే నెలలో ముంబై స్పెషల్ కోర్టు చోటా రాజన్‌కు జీవిత ఖైదు విధించింది. జర్నలిస్ట్ జే డే హత్య కేసులో ఆరేళ్ల తర్వాత కోర్టు చోటా రాజన్‌కు మరో సారి జీవిత ఖైదు విధించింది.