శక్తివంతమైన పాస్‌పోర్ట్‌ల జాబితాలో ఐదు స్థానాలు పడిపోయిన భారత్

అంతర్జాతీయ పర్యాటక రంగంలో జరుగుతున్న మార్పుల నేపథ్యంలో గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో భారత ర్యాంకు ఐదు స్థానాలు పడిపోయింది.

Update: 2025-01-10 15:31 GMT

దిశ, నేషనల్ బ్యూరో: అంతర్జాతీయ పర్యాటక రంగంలో జరుగుతున్న మార్పుల నేపథ్యంలో గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో భారత ర్యాంకు ఐదు స్థానాలు పడిపోయింది. హెన్లీ అండ్ పార్ట్‌నర్స్ విడుదల చేసిన హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ ప్రకారం.. ఈ సంవత్సరం శక్తివంతమైన పాస్‌పోర్ట్ జాబితాలో మనదేశం 85వ ర్యాంకును చేరుకుంది. 195 దేశాలకు వీసా-రహిత యాక్సెస్‌తో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌గా సింగపూర్ వరుసగా రెండో ఏడాది అగ్రస్థానంలో నిలిచింది. కొవిడ్-19 మహమ్మారి తర్వాత చైనాతో సంబంధాల నేపథ్యంలో జపాన్ 193 దేశాలకు యాక్సెస్ అందిస్తూ జాబితాలో రెండో స్థానంలో ఉంది. అయితే, భారత పర్యాటకులు 57 దేశాలకు వీసా-రహిత ప్రయాణం చేయవచ్చు. అభివృద్ధి చెందుతున్న గ్లోబల్ మొబిలిటీ ల్యాండ్‌స్కేప్‌లో భారతీయ ప్రయాణీకులు ఎదుర్కొంటున్న సవాళ్లను పడిపోయిన ఈ ర్యాంక్ సూచిస్తుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నారు.

అంతర్జాతీయ సంబంధాలను మెరుగుపరచడం, వీసా ప్రక్రియలను సరళీకృతం చేయడంపై దృష్టి సారించడం ద్వారా ఈన్ని అధిగమించవచ్చని నిపుణులు భావిస్తున్నారు. పెరుగుతున్న ఆర్థిక బలం, వివీధ దేశాలతో ఉన్న భాగస్వామ్యాలతో రానున్న సంవత్సరాల్లో భారత్ తన గ్లోబల్ మొబిలిటీ స్టేటస్‌ను పెంచుకునే సామర్థ్యం కలిగి ఉందని పేర్కొన్నారు. ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్ లాంటి యూరప్ దేశాలు 192 దేశాలకు యాక్సెస్ సాధించి మూడో స్థానంలో ఉన్నాయి. ఆస్ట్రియా, డెన్మార్క్, ఐర్లాండ్, స్వీడన్ వంటి దేశాలు 191 దేశాలతో నాలుగో స్థానంలో ఉన్నాయి. యూకే, బెల్జియం, పోర్చుగల్ దేశాలు ఐదోస్థానంలో నిలిచాయి. కానీ, అమెరికా, యూకే లాంటి ప్రధాన దేశాలు తమ స్థానాలను కోల్పోయాయి. అమెరికా తొమ్మిదో స్థానానికి పడిపోగా, యూకే ఐదో స్థానంలో ఉంది.

Tags:    

Similar News