Alfred: ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడు కన్నుమూత..112 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచిన జాన్
ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడు ఇంగ్లండ్‌కు చెందిన జాన్ ఆల్ఫ్రెడ్ టిన్నిస్‌వుడ్ కన్నుమూశారు. 112 ఏళ్ల వయసులో ఆయన తుదిశ్వాస విడిచారు.
దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడు ఇంగ్లండ్‌కు చెందిన జాన్ ఆల్ఫ్రెడ్ టిన్నిస్‌వుడ్ (John Alfred Tinniswood) కన్నుమూశారు. 112 ఏళ్ల వయసులో ఆయన తుదిశ్వాస విడిచారు. సౌత్ పోర్టులోని కేర్ సెంటర్‌లో చికిత్స పొందుతున్న జాన్ పరిస్థితి విషమించి మృతి చెందినట్టు ఆయన కుటుంబ సభ్యులు ఓ ప్రకటనలో తెలిపారు. బ్రిటన్‌లోని లివర్‌పూల్‌లో 1912 ఆగస్టు 26న జన్మించిన టిన్నిస్‌వుడ్.. షెల్, బీపీ కంపెనీల్లో అకౌంటెంట్‌గా పనిచేసి1972లో ఉద్యోగ విరమణ పొందారు. వెనిజులాకు చెందిన 114 ఏళ్ల జువాన్ విసెంటె పెరెజ్ (Vissente perege) ఈ ఏడాది ఏప్రిల్‌లో మరణించిన తర్వాత ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడిగా ప్రకటించబడ్డాడు. ఆయనకు కుమార్తె సుసాన్, నలుగురు మనవళ్లు, ముగ్గురు మనవరాళ్లు ఉన్నారు. భార్య బ్లాడ్వెన్ 1986లోనే మరణించింది. ఆగస్ట్‌లో టిన్నిస్‌వుడ్‌కి 112 ఏళ్లు నిండాయి. అప్పుడు కూడా ఆయన చురుకుగానే ఉండేవారని, తన సొంత పనులు చేసుకునేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే టిన్నిస్‌వుడ్ స్థానంలో కొత్త రికార్డ్ హోల్డర్‌గా ఎవరు వస్తారో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఇంకా పేర్కొనలేదు.