తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్.. భారీగా నిధులు విడుదల

దేశంలోని వివిధ రాష్ట్రాలకు కేంద్రం(NDA Govt) శుభవార్త చెప్పింది. పన్నుల్లో వాటా కింద శుక్రవారం రాష్ట్రాలకు నిధులు విడుదల చేసింది.

Update: 2025-01-10 10:37 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశంలోని వివిధ రాష్ట్రాలకు కేంద్రం(NDA Govt) శుభవార్త చెప్పింది. పన్నుల్లో వాటా కింద శుక్రవారం రాష్ట్రాలకు నిధులు విడుదల చేసింది. మొత్తం రూ.1,73,030 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు రూ.7002 కోట్లు, తెలంగాణకు రూ.3,637 కోట్లు విడుదల చేసింది. మూలధన వ్యయం, అభివృద్ధి, సంక్షేమానికి నిధులు కేటాయిస్తున్నట్లు పేర్కొంది. ఇదిలా ఉండగా.. నిధుల కేటాయింపుపై తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌‌కు అధిక నిధులు కేటాయించి.. అందులో సగం కూడా తెలంగాణకు కేటాయించకపోవడంపై సీఎం సహా మంత్రులు కూడా మండిపడుతున్నట్లు తెలుస్తోంది. మొదటి నుంచి కూడా తెలంగాణ పట్ల కేంద్రం చిన్నచూపు చూస్తోందని కేంద్రంపై విమర్శలు చేస్తున్నారు. ‘రాబోయే పండగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని, రాష్ట్రాల మూలధన వ్యయాన్ని వేగవంతం చేయడానికి, వారి అభివృద్ధి/సంక్షేమ సంబంధిత వ్యయాలకు ఆర్థిక సహాయం కోసం విడుదలు చేస్తున్నాం’ అని కేంద్ర ఆర్థికశాఖ పేర్కొంది.

Tags:    

Similar News