Shocking incident: ‘శ్మశానంలో ఆ పని అస్సలు ఊహించలేదు’.. డౌట్ వచ్చి చూడగా అంతా షాక్!
మొక్కలకు నీళ్లు పోయాడం సాధారణమైన విషయం. ఇది అందరికీ తెలిసిందే. అంతేకాదు మొక్కలకు నీరు పోయడం మంచి పౌరుడి లక్షణం.
దిశ,వెబ్‌డెస్క్: మొక్కలకు నీళ్లు పోయాడం సాధారణమైన విషయం. ఇది అందరికీ తెలిసిందే. అంతేకాదు మొక్కలకు నీరు పోయడం మంచి పౌరుడి లక్షణం. కానీ ఓ యువకుడు వింతగా ఓ సమాధులకు నిరంతరం నీళ్లు పోస్తున్నాడు. అసలు విషయంలోకి వెళితే.. ఓ యువకుడు తనకు దగ్గర్లోని సమాధుల మధ్యలోకి నీళ్లు తీసుకెళ్లి పోస్తున్నాడు. అక్కడ మొక్కలకు నీరు పోస్తున్నాడు. ఏదోక రోజు అంటే ప్రకృతి(nature)పై అమితమైన ప్రేమ అనుకోవచ్చు. కానీ చాలా కాలం నుంచి ఆ యువకుడు ఇదే పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అతన్ని గమనిస్తున్న జనాలు ఆశ్చర్యానికి గురయ్యారు. అసలు ఏముందని ఆ సమాధిలో నీరు పోస్తున్నాడు. అసలు ఏం జరుగుతోంది. ఇలా పలు సందేహాలతో విసిగిపోయిన జనాలు ఇక లాభం లేదని పోలీసులకు సమాచారం అందించారు.
ఈ విషయం తెలుసుకన్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఈ క్రమంలో సమాధులకు రోజు నీళ్లు ఎందుకు పోస్తున్నాడో అని అక్కడికి వెళ్లి పరిశీలించారు. తీరా అక్కడికి వెళ్లి చూస్తే వారు షాక్‌కు గురయ్యారు. దీంతో వీడు సామాన్యుడు కాదు రోయ్.. అని నోరెళ్లబెట్టారు. ఎందుకంటే.. ఆ యువకుడు రోజు సమాధుల మధ్య నీళ్లు పోసేది.. గంజాయి మొక్కలకు అని చూసి నివ్వేరపోయారు. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండల కేంద్రంలో వెలుగు చూసింది. గంజాయికి బానిసైన ఓ యువకుడు ప్రతిసారీ గంజాయిని కొనడం కష్టంగా మారడంతో ఏకంగా తానే సొంతంగా పండించుకోవడం మొదలు పెట్టాడు. ఇంట్లో పెంచితే పోలీసులు, చుట్టుపక్కల వారికి అనుమానం వస్తుందని, ఎవరూ ఊహించని విధంగా స్మశానంలో గంజాయి సాగు మొదలు పెట్టాడు. ఈ క్రమంలో పోలీసులు ఆ యువకుడిని హెచ్చరించారు. ఇంకోసారి గంజాయి సేవించినా.. గంజాయి సాగు చేసినట్లు తెలిసిన లక్ష రూపాయల జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా తప్పదని అధికారులు హెచ్చరించారు.