CM Revanth Reddy: కలెక్టర్‌ల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సీరియస్!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ (శుక్రవారం) సచివాలయంలో సచివాలయంలో కలెక్టర్ల‌తో సమావేశం నిర్వహించారు.

Update: 2025-01-10 13:38 GMT

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో : ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనల నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి అధికారులపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఇవాళ ముఖ్యమంత్రి సచివాలయంలో కలెక్టర్ల‌తో సమావేశం నిర్వహించారు. దాదాపు గంటకుపైగా ఈ భేటీ కొనసాగింది. డైట్, కాస్మోటిక్ చార్జీలు ఇటీవల పెంచినా ఫుడ్ పాయిజన్ ఘటనలు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నాయని సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. గురుకులాలకు కలెక్టర్లు విజిట్ చేయకపోవడమే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అభిప్రాయపడ్డారని, ఇకపై ప్రతీ వారం పాఠశాలలో కలెక్టర్‌లు విజిట్ చేసి రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. అలాగే జనవరి 26న రిపబ్లిక్ డే నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను అమలు చేయాలని సీఎం స్పష్టం చేశారు. పథకాల అమలుపై రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో గ్రామసభల నిర్వహణ, మున్సిపాలిటీల్లో వార్డు సభలు నిర్వహించేందుకు వెంటనే సన్నాహాలు చేసుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు.

ఇందిరమ్మ ఇళ్ల సర్వేపైనా అసంతృప్తి..

అలాగే రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు అంశాలపై చర్చించి, కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వానికి మంచి లేదా చెడ్డ పేరు రావాలన్నా.. కలెక్టర్ల పనితీరుపైనే ఆధారపడి ఉందని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు అర్హులకు చేరాలని, చివరి లబ్ధిదారుల వరకు అందాలని సూచించారు. ప్రభుత్వం అనుకున్న టార్గెట్లను నెరవేర్చే బాధ్యత కలెక్టర్లదేనని సీఎం స్పష్టం చేశారు. కొంతమంది అధికారులు ఇందిరమ్మ ఇండ్ల సర్వేను మానిటర్ చేయడం లేదని దృష్టికి వచ్చినట్లు వెల్లడించారు. ప్రజలకు అందుబాటులో ఉండాలని, నిర్లక్ష్యం వహిస్తే కలెక్టర్లపై వేటు తప్పదని సీఎం హెచ్చరించారని తెలుస్తోంది.

Tags:    

Similar News