CM Revanth: ఎట్టి పరిస్థితుల్లో వారికి రైతుభరోసా ఇవ్వకూడదు

సచివాలయం వేదికగా జిల్లా కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సమావేశం నిర్వహించారు.

Update: 2025-01-10 14:09 GMT

దిశ, వెబ్‌డెస్క్: సచివాలయం వేదికగా జిల్లా కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సమావేశం నిర్వహించారు. రైతు భరోసా(Rythu Bharosa), ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాల అమలుపై చర్చించారు. లబ్ధిదారుల జాబితాను వెంటనే తయారు చేయాలని ఆదేశించారు. జనవరి 26న రిపబ్లిక్ డే నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని నిర్ణయించారు. ఈ నాలుగు పథకాల అమలుపై రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో గ్రామసభల నిర్వహణ, మున్సిపాలిటీల్లో వార్డు సభలు నిర్వహించేందుకు వెంటనే సన్నాహాలు చేసుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలు చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈనెల 26 తర్వాత అన్ని జిల్లాల్లో పర్యటిస్తా అని అన్నారు. అన్ని జిల్లాల్లో ఆకస్మిక తనిఖీలే ఉంటాయని స్పష్టం చేశారు. సాగు యోగ్యమైన భూములకు మాత్రమే రైతుభరోసా చెల్లించాలని మరోమారు నొక్కి చెప్పారు. పంట వేసినా.. వేయకున్నా.. సాగు యోగ్యమైన భూములకు చెల్లించాలని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో అనర్హులకు రైతు భరోసా ఇవ్వొద్దని తెలిపారు. క్షేత్రస్థాయిలో పర్యటించి అనర్హులను గుర్తించాలని సూచించారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావులు పాల్గొన్నారు.

Tags:    

Similar News