Modi : లైఫ్ మంత్ర రివీల్ చేసిన మోడీ.. అదే తన ఐడియాలజీ అని క్లారిటీ
ఇంటెన్షన్‌తో తాను ఏ తప్పూ చేయలేదని అదే తన లైఫ్ మంత్ర అన ప్రధాని మోడీ అన్నారు.
దిశ, నేషనల్ బ్యూరో : ఇంటెన్షన్‌తో తాను ఏ తప్పూ చేయలేదని అదే తన లైఫ్ మంత్ర అన ప్రధాని మోడీ అన్నారు. శుక్రవారం జెరోదా ఫౌండర్ నిఖిల్ కామత్ పొడ్‌క్యాస్ట్‌తో ఆయన ఈ మేరకు పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘సీఎంగా ఉన్నప్పుడు ఓ స్పీచ్‌లో నేను మాట్లాడాను. కష్టపడి పనిచేయడానికి ఎప్పుడూ సిగ్గుపడను. కానీ ఎప్పుడూ చెడు ఇంటెన్షన్‌తో తప్పు చేయలేదు. అదే నా లైఫ్ మంత్ర.’ అని మోడీ అన్నారు. నేను మనిషినే తప్పులు చేసి ఉండొచ్చు.. తానేమి భగవంతుడ్ని కాదని మోడీ అన్నారు. సిద్ధాంతం కన్నా ఆదర్శవాదం చాలా ముఖ్యమైనదన్నారు. సిద్ధాంతాలు లేకుంటే రాజకీయాలు లేవని.. అయితే ఆదర్శవాదం తప్పనిసరి అని తెలిపారు.
నేషన్ ఫస్ట్ నా సిద్ధాంతం..
గాంధీ, సవార్కర్‌ల ఎంచుకున్న మార్గాలు వేరైనా వారి స్వాతంత్రం వారి లక్ష్యం అన్నారు. పరిస్థితులకు అనుగుణంగా మారే వ్యక్తిని తాను కాదని.. ఒకే సిద్ధాంతాన్ని నమ్మి పెరిగానన్నారు. ‘నేషన్ ఫస్ట్’ అనేది తన ఐడియాలజీ అని.. మిగతదంతా దాని తర్వాతే అన్నారు. చిన్నప్పుడు తాను అనేక ఒడిదొడుకులు ఎదుర్కొన్నా అని మోడీ గుర్తు చేశారు. ఆ పాఠాలే కష్టాలను అధిగమించడాన్ని నేర్పాయన్నారు. నీళ్ల కోసం రెండు మూడు కిలో మీటర్ల దూరం మహిళలు నడిచే రాష్ట్రం నుంచి తాను వచ్చానన్నారు. గతంలో సైతం సంక్షేమ పథకాలు ఉండేవని అయితే ప్రజల స్వప్నాలు సాకారం చేయడం కోసం నిరంతరం కృషి చేస్తా అని మోడీ అన్నారు.