Hementh soren: మోడీ, అమిత్‌షాలతో హేమంత్ సోరెన్ భేటీ.. ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం

జార్ఖండ్‌లో ఘన విజయం సాధించిన తర్వాత జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) చీఫ్ హేమంత్ సోరెన్ మంగళవారం ఢిల్లీలో పర్యటించారు.

Update: 2024-11-26 16:37 GMT
Hementh soren: మోడీ, అమిత్‌షాలతో హేమంత్ సోరెన్ భేటీ.. ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం
  • whatsapp icon

దిశ, నేషనల్ బ్యూరో: జార్ఖండ్‌లో ఘన విజయం సాధించిన తర్వాత జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) చీఫ్ హేమంత్ సోరెన్ (Hemanth soren) మంగళవారం ఢిల్లీలో పర్యటించారు. ప్రధాని నరేంద్ర మోడీ (Pm modi), హోం మంత్రి అమిత్ షా (Amith shah), కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun karge), రాహుల్ గాంధీ (Rahul gandhi), ప్రియాంక గాంధీ, ఆమ్ ఆద్మీ పార్టీ (Aap) కన్వీనర్‌ అరవింద్ కేజ్రీవాల్‌ (Kejriwal)తో సమావేశమయ్యారు. తన ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా మోడీతో పాటు ఇతర అగ్రనేతలందరినీ ఆహ్వానించారు. హేమంత్‌తో పాటు ఆయన భార్య కల్పనా సోరెన్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా హేమంత్ మీడియాతో మాట్లాడుతూ.. అగ్రనేతల ఆశీస్సులో కోసమే కలిశానని, భవిష్యత్ లోనూ మరిన్ని సమావేశాలు ఉంటాయని తెలిపారు. కాగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం నేతృత్వంలోని కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 81 స్థానాలకు గాను 56 సీట్లలో గెలుపొందింది. నవంబర్ 28న సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Tags:    

Similar News