TGPSC FSO Results: తెలంగాణ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..!
తెలంగాణ(TG) రాష్ట్రంలోని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ (FSO) నియామక ఫలితాలు విడుదలయ్యాయి.
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ(TG) రాష్ట్రంలోని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్(FSO) నియామక ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తంగా 24 మందిని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC) సెలెక్ట్ చేసింది. కాగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్(IPM) పబ్లిక్ హెల్త్ అండ్ పుడ్ అడ్మినిస్ట్రేషన్(PH&FA) విభాగంలో 24 ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి టీజీపీఎస్సీ 2022 జులై 21న నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు 16,381 మంది దరఖాస్తు(Apply) చేసుకోగా.. 2022 నవంబర్ 7న ఆన్‌లైన్ విధానంలో రాత పరీక్ష నిర్వహించారు. ఈ నెల 7,8 తేదీల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసి.. ఇవాళ ఫైనల్ రిజల్ట్స్ ప్రకటించారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్ధుల వివరాలు టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ https://websitenew.tspsc.gov.in/లో ఉన్నాయని కమిషన్ కార్యదర్శి నవీన్ నికోలస్(Naveen Nicholas) తెలిపారు.