Love Reddy: ఎమమోషనల్‌గా ఆకట్టుకుంటున్న ‘లవ్ రెడ్డి’ ట్రైలర్..

అంజన్ రామచంద్ర (Anjan Ramachandra), శ్రావణి రెడ్డి (Shravani Reddy) జంటగా నటిస్తున్న చిత్రం ‘లవ్ రెడ్డి’

Update: 2024-10-15 15:52 GMT

దిశ, సినిమా: అంజన్ రామచంద్ర (Anjan Ramachandra), శ్రావణి రెడ్డి (Shravani Reddy) జంటగా నటిస్తున్న చిత్రం ‘లవ్ రెడ్డి’ (Love Reddy). గీతాన్స్ ప్రొడక్షన్స్, సెహెరి స్టూడియో, ఎమ్జీఆర్ ఫిలిమ్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీని నూతన దర్శకుడు స్మరన్ రెడ్డి తెరకెక్కిస్తున్నాడు. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా స్వచ్ఛమైన ప్రేమకథగా రూపొందుతున్న ఈ మూవీ అక్టోబర్ 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇందులో భాగంగా.. తాజాగా సక్సెస్ ఫుల్ నిర్మాత ఎస్ కేఎన్ చేతుల మీదుగా ‘లవ్ రెడ్డి’ సినిమా ట్రైలర్ (trailer) రిలీజ్ చేశారు.

ఇక ట్రైలర్ (trailer) విషయానికి వస్తే.. ఎమమోషనల్ ఎలిమెంట్స్‌తో సాగిన ఈ ట్రైలర్ (trailer)లో ‘నారాయణరెడ్డి (హీరో)కి ఇంట్లో వాళ్లు ఎన్నో పెళ్లి సంబంధాలు చూస్తారు. అయితే ఏ అమ్మాయి అతనికి నచ్చదు. కానీ ఓ ఫంక్షన్‌లో అందమైన అమ్మాయిని ఇష్టపడి లవ్ రెడ్డి (Love Reddy)గా మారిపోతాడు. అప్పటి నుంచి ఆ అమ్మాయే లోకంగా బతుకుతాడు. తనది రెగ్యులర్ నిబ్బా నిబ్బీ (nibba nibby) లవ్ స్టోరీ కాదంటాడు. ఓ రోజు ఆ అమ్మాయి నారాయణరెడ్డిని రిజెక్ట్ చేస్తుంది. ప్రాణం కన్నా ప్రేమించిన ఆ అమ్మాయి నారాయణరెడ్డి ఉరఫ్ లవ్ రెడ్డి (Love Reddy)ని ఎందుకు రిజెక్ట్ చేసింది. ఆ తర్వాత హీరో లైఫ్ ఎలా టర్న్ అయ్యింది. వీరి ప్రేమ కథ చివరికి ఎక్కడికి చేరింది అనేది’ కథ. రాయలసీమ (Rayalaseema) నేపథ్యంతో, అక్కడి యాసలో ఈ సినిమా ట్రైలర్ (trailer) ప్రజెంట్ సోషల్ మీడియాలో ఆకట్టుకుంటోంది.


Similar News