స్పెషాలిటీ సేవలు ప్రారంభించాలి: వైద్యారోగ్యశాఖ

ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలలో ఓపీ స్పెషాలిటీ సేవలు ప్రారంభించాలని వైద్యారోగ్యశాఖ ఆదేశాలిచ్చింది.

Update: 2024-10-15 17:22 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలలో ఓపీ స్పెషాలిటీ సేవలు ప్రారంభించాలని వైద్యారోగ్యశాఖ ఆదేశాలిచ్చింది. వారంలో ఐదు రోజుల పాటు ఈ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని సూచించింది. ఈ మేరకు మంగళవారం అన్ని జిల్లాల డీఎంహెచ్​వోలతో  ఉన్నతాధికారులు రివ్యూ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి కేంద్రాల్లో ఈ సేవలను అందుబాటులోకి తేనున్నట్లు వెల్లడించారు. బస్తీ దవాఖాన్లు, యూపీహెచ్‌సీలు, పల్లె దవాఖాన్లలో ఈ వైద్యసేవలు కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో జనరల్ మెడిసిన్, గైనకాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్‎టి, ఆప్తమాలిక్ తదితర 12 రకాల సేవలు అందుబాటులోకి రానున్నాయి.


Similar News