జార్ఖండ్ ఎన్నికల సీనియర్ అబ్జర్వర్ గా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క..మహారాష్ట్రకు ఉత్తమ్, సీతక్క.. ఏఐసీసీ ఆదేశాలు
జార్ఖండ్ ఎన్నికల సీనియర్ అబ్జర్వర్ గా తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కాంగ్రెస్ హైకమాండ్ నియమించింది.
దిశ, తెలంగాణ బ్యూరో: జార్ఖండ్ ఎన్నికల సీనియర్ అబ్జర్వర్ గా తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కాంగ్రెస్ హైకమాండ్ నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పాటు మహారాష్ట్ర మరాఠ్వాడా డివిజన్ కు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని, నార్త్ మహారాష్ట్రకు మంత్రి సీతక్కలను నియమించారు. ఎన్నికల నేపథ్యంలో నేతల కో ఆర్డినేషన్, పార్టీ బలోపేతం, వ్యూహాలు వంటివన్నీ ఫాలోఅప్ చేయనునున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.