ప్రభుత్వానికి అక్రిడిటేషన్ రూల్స్
మీడియా అక్రిడిటేషన్‌ల జారీకి కొత్త నిబంధనలు రానున్నాయి. ఇటీవల ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ 45 రోజుల్లో ఆరు సార్లు మీటింగ్ లు నిర్వహించుకొని కొత్త గైడ్ లైన్స్ ను రూపొందించాయి.
దిశ, తెలంగాణ బ్యూరో: మీడియా అక్రిడిటేషన్‌ల జారీకి కొత్త నిబంధనలు రానున్నాయి. ఇటీవల ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ 45 రోజుల్లో ఆరు సార్లు మీటింగ్ లు నిర్వహించుకొని కొత్త గైడ్ లైన్స్ ను రూపొందించాయి. వీటిని ప్రభుత్వం పరిశీలించి తుది నిర్ణయం తీసుకోనున్నది. స్పెషల్ కమిటీ తయారు చేసిన ఆ రిపోర్టును గురువారం ఐ అండ్ పీఆర్ కమిషనర్ హరీష్, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డిలు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అందజేశారు. ఇదిలా ఉండగా, మీడియా అక్రిడిటేషన్ కార్డుల పంపిణీకి స్పష్టమైన మార్గదర్శకాలు ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు మీడియా అకాడమీ చైర్మన్ అధ్యక్షతన ఓ ప్రత్యేక కమిటీని వేసింది. ఇందులో కే శ్రీనివాస్, అమెర్ అలీఖాన్, అంకం రవి, రవికాంత్ రెడ్డి, నరహరిలు మెంబర్లు గా ఉన్నారు. ఈ కమిటీలు సుదీర్ఘంగా అధ్యయనం చేసి రూల్స్ ఫ్రేమ్ చేసినట్లు అధికారులు ప్రకటించారు.