BJP: కాంగ్రెస్ గ్యారెంటీలకు నో గ్యారెంటీ.. బీజేపీ తెలంగాణ సంచలన ట్వీట్

కాంగ్రెస్‌(Congress) ఇచ్చిన గ్యారెంటీలకి( Guarantees) నో గ్యారెంటీ(No Guarantee) అని బీజేపీ తెలంగాణ (BJP Telangana) ఎద్దేవా చేసింది.

Update: 2025-01-04 17:30 GMT

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్‌(Congress) ఇచ్చిన గ్యారెంటీలకి( Guarantees) నో గ్యారెంటీ(No Guarantee) అని బీజేపీ తెలంగాణ (BJP Telangana) ఎద్దేవా చేసింది. కేబినెట్ భేటీ(Cabinet Meeting) అనంతరం రైతు భరోసా(Raithu Bharosa)పై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రకటన చేశారు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. కాంగ్రెస్ పార్టీ(Congress Part)పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రకటించిన ఏ ఒక్క హామీకి గ్యారెంటీ లేదని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో గొప్ప వాగ్దానాలు చేసింది. కానీ అమలులోకి వచ్చేసరికి ఘోరంగా విఫలమవుతుందని ఆరోపణలు చేసింది. తెలంగాణలోని రైతులందరికీ ఏటా ఎకరాకు రూ.15,000 ఆర్థిక సహాయం అందజేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, కానీ ఒక సంవత్సరం పాటు పథకాన్ని అమలు చేయడంలో విఫలమైన తర్వాత, ఇప్పుడు సంవత్సరానికి రూ.12,000కి సహాయాన్ని తగ్గించినట్లు ప్రకటించిందని తెలిపింది. అంతేగాక అనేకషరతులను ప్రవేశపెట్టడం ద్వారా అర్హులైన లబ్ధిదారుల సంఖ్యను పరిమితం చేయడానికి ఉద్దేశపూర్వక ప్రయత్నాలు జరిగాయని, చాలా మంది రైతులు ప్రయోజనాలను పొందకుండా చేసిందని వ్యాఖ్యానించింది.

Tags:    

Similar News