కేటీఆర్‌ రిక్వెస్ట్‌కు ఈడీ ఆమోదం

రేపు విచారణకు హజరు కాలేను.. నాకు కొంత సమయం కావాలని ఈడీ(ED) అధికారులకు కేటీఆర్(KTR) విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.

Update: 2025-01-06 17:08 GMT

దిశ, వెబ్‌డెస్క్: రేపు విచారణకు హజరు కాలేను.. నాకు కొంత సమయం కావాలని ఈడీ(ED) అధికారులకు కేటీఆర్(KTR) విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు(TG High Court) తీర్పు రిజర్వ్‌లో ఉన్నందున విచారణకు సమయం కావాలని కోరారు. తాజాగా కేటీఆర్‌ విజ్ఞప్తిపై ఈడీ స్పందించింది. సమయం కావాలని రిక్వెస్ట్‌ చేసిన కేటీఆర్‌కు విజ్ఞప్తికి ఆమోదం తెలిపింది. విచారణ కోసం మరో తేదీ ప్రకటిస్తామని ఈడీ స్పష్టం చేసింది. కాగా, జనవరి 7న కేటీఆర్ ఈడీ విచారణకు హాజరుకావాల్సి ఉంది. మరోవైపు ఈ ఫార్ములా రేస్ కేసులో కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై జనవరి 7న ఉదయం 10.30 గంటలకు హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. ఏసీబీ కేసు కొట్టి వేయాలన్న కేటీఆర్ పిటిషన్‌పై ఇటీవల వాదనలు ముగిశాయి. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. తదుపరి జడ్జిమెంట్ వచ్చే వరకు కేటీఆర్‎ను అరెస్ట్ చేయకుండా విచారణ చేసుకోవచ్చని తెలిపింది.

Tags:    

Similar News