HMPV : హెచ్ఎంపీవీపై నెగెటివ్ ప్రచారం చేస్తే కఠిన చర్యలు : దామోదర రాజనర్సింహ
చైనా కొత్త వైరస్ పై నెగెటివ్ ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ(Damodara Rajanarsimha) హెచ్చరించారు.
దిశ, వెబ్ డెస్క్ : చైనా కొత్త వైరస్ పై నెగెటివ్ ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ(Damodara Rajanarsimha) హెచ్చరించారు. హెచ్ఎంపీవీ(HMPV)పై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. 2001లోనే HMPV వైరస్ ఉనికిని కనుగొన్నారని తెలిపిన మంత్రి.. శ్వాసకోస వ్యవస్థపై వైరస్ స్వల్ప ప్రభావం చూపుతుందని, నోటి తుంపర్ల ద్వారా ఇతరులకు వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందన్నారు. ఇతర దేశాలు, రాష్ట్రాల్లో పరిస్థితిని సమీక్షిస్తున్నామని, అనవసర భయాలు అవసరం లేదని, అప్రమత్తంగా ఉంటే చాలన్నారు. రాష్ట్రంలో వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని, ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి రాజనర్సింహ వెల్లడించారు.