అందరికీ అమ్మ పుస్తకాన్ని ఆవిష్కరించిన మాజీ సీఎం కేసీఆర్

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని పలువురు బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు , ప్రజా ప్రతినిధులు శనివారం బీఆర్ఎస్ అధినేత, కేసీఆర్ ను మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

Update: 2025-01-04 17:23 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని పలువురు బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు , ప్రజా ప్రతినిధులు శనివారం బీఆర్ఎస్ అధినేత, కేసీఆర్ ను మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్, రచయిత, జూలూరు గౌరీశంకర్ తెలంగాణ తల్లి పై రాసిన ‘అందరికీ అమ్మ' పుస్తకాన్ని కేసీఆర్, ఎమ్మెల్యేలు జి. జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే తాతా మధు, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి తో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఇతర బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.


Similar News