Health Director: తెలంగాణలో కొత్త వైరస్ ఆచూకీ లేదు

తెలంగాణలో కొత్త వైరస్(HMPV Virus) ఆచూకీ లేదని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్రనాయక్(Ravindra Naik) పేర్కొన్నారు.

Update: 2025-01-04 17:30 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో కొత్త వైరస్(HMPV Virus) ఆచూకీ లేదని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్రనాయక్(Ravindra Naik) పేర్కొన్నారు. చైనాలో కొత్త వైరస్ (హెచ్ ఎంపీవీ) అంటూ హడావిడి జరుగుతుందని, కానీ ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ఇన్ఫో లేదన్నారు. అయితే అప్రమత్తంగా ఉండాల్సిందేనని శనివారం ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు తప్పకుండా ముక్కు, నోరు కవర్ అయ్యేలా కచీఫ్, టిష్యూ పేపర్ ను అడ్డం పెట్టుకోవాలని సూచించారు. దగ్గు, జలుబు ఉన్నోళ్లు జన సమూహాల్లోకి వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

శ్వాస కోస సమస్యలు ఉన్నోళ్లు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నదని నొక్కి చెప్పారు. గడిచిన ఏడాదిగా శ్వాస కోశ బాధితుల సంఖ్య నార్మల్ గానే ఉన్నదన్నారు. కొవిడ్ అనుభంతో ప్రికాషన్స్ తీసుకోవడం బెటర్ అంటూ వివరించారు. చేతులను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకోవడం, ఫీవర్, దగ్గు, జలుబు ఉన్నోళ్లు జన సమూహాల్లోకి వెళ్లకపోవడం వంటివి చేయాలని వివరించారు. షేక్ హ్యాండ్స్ కు చెక్ పెట్టాలన్నారు. ప్లూ సింప్టమ్స్ ఉన్నోళ్లు కేర్ తీసుకోవాలన్నారు.

Tags:    

Similar News