మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్.. దీపాదాస్ మున్షీకి ఫిర్యాదు చేసిన సొంత పార్టీ ఎమ్మెల్యేలు
మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha)కు సొంత పార్టీ ఎమ్మెల్యేలు(Congress MLAs) షాకిచ్చారు.
దిశ, వెబ్‌డెస్క్: మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha)కు సొంత పార్టీ ఎమ్మెల్యేలు(Congress MLAs) షాకిచ్చారు. మంత్రి సురేఖపై చర్యలు తీసుకోవాలని ఏఐసీసీ ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ(AICC in-charge Deepadas Munshi)కి ఫిర్యాదు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కొండా వర్గీయులు ఇబ్బందులు పెడుతున్నారని ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కంప్లైంట్ చేశారు. రేపు(బుధవారం) పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌ను కూడా కలిసి ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు. ఇదిలా ఉండగా.. ఈ మధ్య మంత్రి సురేఖను వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి.
ఒక దాని తర్వాత ఒకటి వస్తున్న వివాదాలతో మంత్రి డిఫెన్స్‌లో పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇటీవల సినీ హీరో నాగార్జున కుటుంబం మీద చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఎంతటి దుమారం రేపాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చివరకు మంత్రి క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. తర్వాత పరకాల నియోజకవర్గంలో కొండా సురేఖ భర్త కొండామురళి, ఎమ్మెల్యే రేవూరి వర్గీయుల మధ్య గొడవ చిలికి చిలికి గాలివానగా మారింది. కొండా వర్గీయులను పోలీసులు అరెస్ట్ చేయడం.. వెంటనే ఆమె ఆటో కట్టుకుని గీసుకొండ పోలీస్ స్టేషన్‌కు వచ్చి పోలీసులతో ఘర్షణ పడటం కూడా హాట్‌టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలోనే ఆమెపై పార్టీ చర్యలు తీసుకునే అవకాశం ఉందని సైతం వార్తలు వినిపించాయి.