వాయుగుండంగా బలపడిన అల్పపీడనం.. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ప్రస్తుతం చెన్నైకి 490km, పుదుచ్చేరికి 500km, నెల్లూరుకు 590km దూరంలో కేంద్రీకృతమై పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది.

Update: 2024-10-15 16:51 GMT

దిశ, వెబ్‌డెస్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ప్రస్తుతం చెన్నైకి 490km, పుదుచ్చేరికి 500km, నెల్లూరుకు 590km దూరంలో కేంద్రీకృతమై పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. ఈనెల 17న పుదుచ్చేరి-చెన్నై మధ్య తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం(India Meteorological Centre) వెల్లడించింది. దీని ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు(Heavy Rains) కురిసే అవకాశం ఉందని తెలిపింది.

దీంతో మత్య్సకారులు వేటకు వెళ్లొద్దని సూచనలు చేసింది. మరోవైపు.. అగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా అనేకచోట్ల ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో నాలుగు రోజులు వర్షాలు పడే అవకాశం ఉండటంతో ప్రభుత్వం కంట్రోల్‌ రూమ్‌లు, సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేస్తోంది.


Similar News