మాచర్ల రోడ్లకు మహర్దశ.. రహదారుల నిర్మాణానికి కేంద్రం నిధులు మంజూరు

పల్నాడు జిల్లాలోని మాచర్ల రోడ్లకు మహర్దశ పట్టనుంది. మాచర్ల నియోజకవర్గంలో రహదారుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 117.75 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు మాచర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి తెలిపారు.

Update: 2024-10-15 14:19 GMT

దిశ ప్రతినిధి,నరసరావుపేట: పల్నాడు జిల్లాలోని మాచర్ల రోడ్లకు మహర్దశ పట్టనుంది. మాచర్ల నియోజకవర్గంలో రహదారుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 117.75 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు మాచర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి తెలిపారు. నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉండటంతో బ్రహ్మారెడ్డి ఎం.పి.శ్రీ కృష్ణ దేవరాయలుతో రోడ్ల అభివృద్ధి గురించి చర్చించారు. ఎం.పి.శ్రీ కృష్ణ దేవరాయలు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి విన్నవించడంతో ఆయన సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ద్వారా నిధులు మంజూరు చేసినట్లు బ్రహ్మానంద రెడ్డి తెలిపారు.

దుర్గి నుండి వెల్దుర్తి వరకు 17. 6 కిలోమీటర్లకు గాను 31 కోట్ల 60 లక్షలు, పాల్వాయి జంక్షన్ నుంచి సత్రశాల వరకు 11.2 కిలోమీటర్లు గాను 21.65 కోట్ల రూపాయలు, మాచర్ల నుంచి విజయపురి సౌత్ ( వయా కొత్తపల్లి - కొప్పునూరు మీదుగా) 22.8 కిలోమీటర్ల గాను 31 కోట్ల రూపాయలు, లోయపల్లి నుంచి లచ్చంబావి తండా వరకు 25.40 కిలోమీటర్లకు గాను 33.5 కోట్లతో రహదారులు నిర్మించినట్లు ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి వివరించారు. నియోజకవర్గ పరిధిలోని రహదారుల నిర్మాణానికి నిధులు కేటాయించేందుకు కృషిచేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు లకు బ్రహ్మారెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.


Similar News