Nani-Odela 2 : మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ కాంబో రిపీట్..

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబోలో వచ్చిన ‘దసరా’ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

Update: 2024-10-13 10:02 GMT

దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబోలో వచ్చిన ‘దసరా’ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా పలు అవార్డులు అందుకోవడంతో ఈ పాన్ ఇండియా చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఇప్పుడు దీనికి సీక్వెల్ రాబోతుంది. దీని కోసం మరోసారి నాని, శ్రీకాంత్ కాంబో రిపీట్ కానుంది.

తాజాగా, మేకర్స్ దసరా శుభ సందర్భంగా సినిమాని గ్రాండ్‌గా లాంచ్ చేశారు. మూహూర్తం షాట్‌కు నాని క్లాప్‌నిచ్చారు. అయితే ఈ చిత్రానికి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (SLV సినిమాస్) బ్యానర్‌పై పాషనేట్ ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇది ‘NaniOdela2’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. ఇక ఈ విషయం తెలుసుకున్న నాని అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Tags:    

Similar News