ముడా స్కాం ఎఫెక్ట్.. ఖర్గే సంచలన నిర్ణయం

కర్ణాటకలో ముడా స్కాం(MUDA Scam) సంచలనాలు సృష్టిస్తోస్తుంది.

Update: 2024-10-13 11:55 GMT

దిశ, వెబ్ డెస్క్ : కర్ణాటకలో ముడా స్కాం(MUDA Scam) సంచలనాలు సృష్టిస్తోస్తుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఖర్గే కుటుంబానికి చెందిన ట్రస్ట్ కు గతంలో కర్ణాటక పరిశ్రమల అభివృద్ది సంస్థ కేటాయించిన భూమిని తిరిగి ఇచ్చేందుకు నిర్ణయం తెసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కన్నడనాట మైసూర్ ఆర్భన్ డెవలప్మెంట్ అథారిటీ(MUDA) స్కాంపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఖర్గే కుటుంబం మీద కూడా విమర్శలు వస్తున్నాయి. రాహుల్ ఖర్గే ఆధ్వర్యంలోని సిద్ధార్థ్ విహార్ ట్రస్ట్ గతంలో కర్ణాటక ప్రభుత్వం హైటెక్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ పార్క్ హార్డ్ వేర్ సెక్టార్ లో ఐదు ఎకరాల భూమి మంజూరు చేయడంపై ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండించాయి. ఈ క్రమంలోనే ఖర్గే కుటుంబం సదరు ఐదు ఎకరాల భూమిని తిరగి ప్రభుత్వానికి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. కాగా ముడా స్కాంలో ఇప్పటికే కర్ణాటక సీఎం సిద్దరామయ్యపై ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. 


Similar News