OTT : ఔను.. ‘ఓటీటీ’పై ఆర్ఎస్ఎస్ చీఫ్ చెప్పింది నిజమే : కేంద్రం

దిశ, నేషనల్ బ్యూరో : ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లోని కంటెంట్‌పై నియంత్ర లేకుండాపోయిందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలతో కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌జోషి ఏకీభవించారు.

Update: 2024-10-13 12:25 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లోని కంటెంట్‌పై నియంత్ర లేకుండాపోయిందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలతో కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌జోషి ఏకీభవించారు. తాను పూర్తిగా ఆయన అభిప్రాయంతో ఏకీభవిస్తున్నానని తెలిపారు. ఈ అంశంపై సంబంధిత మంత్రిత్వ శాఖ ద్వారా తప్పకుండా తగిన చర్యలు తీసుకుంటామని ప్రహ్లాద్‌జోషి వెల్లడించారు. ఓటీటీ వేదికల్లోని అడ్డదిడ్డమైన కంటెంట్‌ వ్యవహారాన్ని ప్రస్తుతం సంబంధిత శాఖ నిశితంగా పరిశీలిస్తోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఓటీటీ వేదికల నుంచి ఈ తరహా సమస్యే ఉత్పన్నం అవుతోందని కేంద్ర మంత్రి తెలిపారు.

కాగా, ‘‘ఓటీటీ కంటెంట్‌లో కనీస మానవీయ విలువలు లేవు. వాటిలో తప్పుడు ప్రచారానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రజల మెదడును ప్రతికూల ఆలోచనలతో నింపేసే కంటెంటే ఓటీటీలో నిండుగా ఉంది’’ అని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఇటీవల కామెంట్ చేశారు. 


Similar News