Arvind Kejriwal : ఒమర్ అబ్దుల్లా.. నా సాయం తీసుకోండి : అరవింద్ కేజ్రీవాల్

దిశ, నేషనల్ బ్యూరో : జమ్మూకశ్మీర్ కాబోయే సీఎం ఒమర్ అబ్దుల్లాకు ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక సూచన చేశారు.

Update: 2024-10-13 14:37 GMT

దిశ, నేషనల్ బ్యూరో : జమ్మూకశ్మీర్ కాబోయే సీఎం ఒమర్ అబ్దుల్లాకు ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక సూచన చేశారు. ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న జమ్మూకశ్మీర్‌ను పాలించే క్రమంలో ఏదైనా సమస్య ఎదురైతే తన సాయం తీసుకోవాలని కోరారు. జమ్మూకశ్మీర్‌లోని దోడాలో జరిగిన ఒక కార్యక్రమంలో కేజ్రీవాల్ మాట్లాడారు.

‘‘ఢిల్లీలాగే జమ్మూకశ్మీర్‌ కూడా కేంద్రపాలిత ప్రాంతం. రెండుచోట్లా లెఫ్టినెంట్ గవర్నర్‌ చేతిలోనే సర్వాధికారాలు ఉన్నాయి. ఢిల్లీని ఎలా నడపాలో నాకు బాగా తెలుసు. ఈవిషయంలో ఏదైనా అవసరం పడితే ఒమర్ అబ్దుల్లా నా సాయం అడగొచ్చు’’ అని ఆప్ చీఫ్ పేర్కొన్నారు. దోడా అసెంబ్లీ స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి పోటీ చేసిన మెహ్రాజ్ మాలిక్ గెలిచారు. ఈసందర్భంగా నిర్వహించిన విజయోత్సవ సభలో కేజ్రీవాల్ పైవ్యాఖ్యలు చేశారు. కాగా, నేషనల్ కాన్ఫరెన్స్ - కాంగ్రెస్ కూటమికి ఆప్ ఇప్పటికే మద్దతు ప్రకటించింది.


Similar News