చెన్నకేశవ స్వామి ఉత్సవంలో ఒరిగిన రథం.. ఆరుగురికి తీవ్ర గాయాలు

కర్నూలు జిల్లా కందనాతి లక్ష్మీచెన్నకేశవస్వామి ఉత్సవంలో అపశృతి చోటు చేసుకుంది....

Update: 2024-10-13 11:51 GMT

దిశ, వెబ్ డెస్క్: కర్నూలు జిల్లా కందనాతి లక్ష్మీచెన్నకేశవస్వామి ఉత్సవం(Lakshmi Chennakesawaswamy festival)లో అపశృతి చోటు చేసుకుంది. చెన్నకేశవస్వామి ఉత్సవ మూర్తిని కొండపైకి తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగింది. రథం ఒక్కసారిగా ఓ వైపునకు ఒరిగింది. దీంతో ఆరుగురు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. రథం ఒరిగిన వైపు హైటెన్షన్ వైర్లు(High Tension Wires) ఉన్నాయి. కరెంట్ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పడంలో అక్కడున్న భక్తులంతా ఊపిరిపీల్చుకున్నారు. కందనాతి లక్ష్మీ చెన్నకేశస్వామి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. దసరా(Dussehra) తర్వాత జరిగే ఈ ఉత్సవాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారి ఉత్సవ మూర్తులను తీసుకెళ్తుండగా ఘటన జరిగింది. 


Similar News