Natasa Stankovic : పాండ్యా మాజీ వైఫ్ మళ్ళీ ప్రేమలో పడింది

ప్రేమ పెళ్ళి చేసుకున్న క్రికెటర్ హార్ధిక్ పాండ్యా, నటి నటాషా స్టాంకోవిచ్ ల జీవితం విడాకుల అనంతర తరుచు సోషల్ మీడియాలో వైరలవుతోంది.

Update: 2024-10-13 12:04 GMT

దిశ, వెబ్ డెస్క్ : ప్రేమ పెళ్ళి చేసుకున్న క్రికెటర్ హార్ధిక్ పాండ్యా, నటి నటాషా స్టాంకోవిచ్ ల జీవితం విడాకుల అనంతర తరుచు సోషల్ మీడియాలో వైరలవుతోంది. పాండ్యాతో విడాకుల తర్వాత నటాషా యూ ట్యూబర్, బిగ్ బాస్ విజేత ఎల్వీష్ యాదవ్ తో మళ్ళీ ప్రేమలో పడిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. వారిద్ధరు కలిసి ఓ రొమాంటిక్ రీల్ పోస్టు చేసింది. ఓ సరికొత్త అనుభూతి అంటూ దానికి క్యాప్షన్ పెట్టడం ఆసక్తి రేపింది. నటాషా, ఎల్వీష్ యాదవ్ లు కలిసి తిరుగుతున్న వ్యవహారం చూస్తే వారు డేటింగ్ లో ఉన్నారన్న గుసగుసలు బాలివుడ్ లో వినిపిస్తున్నాయి. ఎల్వీష్ యాదవ్ గతంలో పాము విషం అక్రమ సేకరణ కేసులో నిందితుడిగా ఉన్నాడు. కాగా గతంతో నటాషా అంబానీ ఇంట జరిగిన పెళ్లికి మరో ప్రియుడు అలెగ్జాండర్ అలెక్సిలిక్‌‌తో హాజరు కావడంతో అప్పట్లో వారిద్దరు డేటింగ్ లో ఉన్నారన్న ప్రచారం సైతం సాగింది. మరోవైపు నటేషాతో విడాకుల తర్వాత ఇటీవల ఆక్టోబర్ 11న హార్ధిక్ పాండ్యా తన 31వ పుట్టిన రోజున ఒంటరిగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా తన జీవితంలో పడి లేచినట్లుగా ఉందని, సానుకూలత, ఆశయంతో ముందుకెళ్ళడానికి ఇదే మంచి సమయమని, నా తప్పుల నుంచి నేను ఎంతో నేర్చు్కోవాల్సిఉందని పాండ్య పోస్టు చేశాడు.

ఒంటరిగా పాండ్యా పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటుంటే.. మరోవైపు నటాషా మాత్రం కొత్త బాయ్ ఫ్రెండ్‌తో ఎంజాయ్ చేస్తుంది. ప్రస్తుతం ఈ రెండు పోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. విడాకుల అనంతరం పాండ్యా టీమిండియా టీ20 వరల్డ్ కప్ విజయంతో పాటు ఇటీవల బంగ్లాదేశ్ తో టీ 20సిరీస్ విజయంలో కీలక భూమిక పోషించి జోరుమీదున్నాడు. పాండ్యా నటాషాల కొడుకు అగస్త్య ప్రస్తుతం హార్ధిక్ అన్న కృనాల్ పాండ్య ఇంట్లో పెరుగుతున్నాడు. అటు నటాషా సైతం మళ్ళీ సినిమాల్లో బీజీ అయ్యే ప్రయత్నం చేస్తుంది.

Full View


Similar News