బాక్సర్ నిఖత్ జరీన్ కీలక వ్యాఖ్యలు

Update: 2024-10-13 02:55 GMT

దిశ, వెబ్ డెస్క్: భారత బాక్సర్ నిఖత్ జరీన్ ఇటీవల జరిగిన పారిస్ ఒలింపిక్స్ లో తుది దశలో ఘోరమైన పరాభవంతో ఇంటి బాట పట్టిన విషయం తెలిసిందే. కాగా ఆమె రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్ గా కూడా నిలిచారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ఆమెకు డీఎస్పీ పదవిని కూడా ఇచ్చింది. ఇదిలా ఉంటే పారిస్ ఒలింపిక్స్ లో తుదిదశలో ఓడిపోయి ఇంటికి రావడంపై ఆమె కీలక వ్యాఖ్యలు చేసింది. తన పంచ్ పవర్ పెంచుకునేందుకు మంచి కోచ్ కావాలంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.." ఎవరు అంతా పర్ ఫెక్ట్ కాదు. ఓలింపిక్స్ లో ఆ రోజు నాది కాదు. ఒలింపిక్స్ లో అన్‌సీడెడ్‌ ప్లేయర్ గా పోటీకి దిగిన నాకు మొదటి రౌండ్లలోనే అత్యుత్తమ బాక్సర్‌ తో పోటీ ఎదురైంది.

అయినప్పటికీ నా వంతు ప్రయత్నం చేశా కానీ చివరకు ఓడిపోయాను. కానీ గతంలో నా చేతిలో ఓడిన వాళ్ళు పతకాలు గెలవడం నన్ను చాలా బాధకు గురి చేసింది. అయినప్పటికి నిజాన్ని అంగీకరించి ముందుకు సాగాల్సిందే. నాకు ఒక వ్యక్తిగత కోచ్‌ కావాలి. అందుకోసం వెతుకుతున్నాను. నన్ను మరింత మెరుగ్గా మలిచే మంచి కోచ్‌ కోసం ఎదురు చూస్తున్నాను. విదేశాల్లో కోచింగ్‌ తీసుకునేందుకు ఆసక్తిగా ఉన్నాను’ మీడియాతో చెప్పుకొచ్చింది. కాగా ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో ఆమెపై నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

Similar News