సంగారెడ్డి లో పారిశుధ్యం అధ్వాన్నం...
సంగారెడ్డి మున్సిపల్ పరిధిలో పారిశుధ్యం అస్తవ్యస్తంగా తయారైంది. మున్సిపల్ పరిధిలో 38 వార్డులు ఉన్నాయి.
దిశ, సంగారెడ్డి మున్సిపాలిటీ: సంగారెడ్డి మున్సిపల్ పరిధిలో పారిశుధ్యం అస్తవ్యస్తంగా తయారైంది. మున్సిపల్ పరిధిలో 38 వార్డులు ఉన్నాయి. అన్ని వార్డులలో పారిశుధ్యం అధ్వాన్నం గా తయారైంది. ఇందుకు కారణం మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే అని పలువురు ఆరోపిస్తున్నారు. వార్డులలో రోడ్లకు ఇరువైపుల చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. రోజుల తరబడి చెత్త కుప్పలు కుళ్ళిపోవడంతో పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. ఖాళీ స్థలాల్లో చెత్త వేస్తున్న వారికి నామమాత్రంగా జరిమానా వేస్తున్నారు. నెలకు ఇద్దరికీ, ముగ్గురికి ఫైన్స్ వేసి చేతులు దులుపుకుంటున్నారు. సకాలంలో మున్సిపల్ చెత్త బండి రాకపోవడమే అని పలువురు తెలుపుతున్నారు. అంతే కాకుండా సకాలంలో మురికి కాలువలలో పేరుకుపోయిన చెత్తను తొలగించక పోవడంతో మురికి కాలువలలో నీరు నిలువ ఉండి దోమలు వృద్ధి చెందుతున్నాయి. తద్వార ఇండ్లలో దోమలు చేరి మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ తదితర వ్యాధులు వ్యాపిస్తున్నాయి. మున్సిపల్ పరిధిలో పారిశుధ్యం సక్రమంగా ఉంటే ప్రజలు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకొని ప్రజలు కోరుతున్నారు.