తృటిలో తప్పిన ప్రమాదం.. ప్లెక్సీ విరిగిపడి పలువురికి గాయాలు..

సంగారెడ్డి పట్టణ కేంద్రంలోని ఐబీ సమీపంలో గురువారం ఉదయం ఫ్లెక్సీ నిర్వాహకుల నిర్లక్ష్యం వలన రహదారిలో ప్రయాణిస్తున్న వాహనదారి పై ఫ్లెక్సీ విరిగిపడిన క్రమంలో వాహనదారులు గాయాల పాలు కాగా స్థానికులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

Update: 2024-11-28 17:12 GMT

దిశ, సంగారెడ్డి : సంగారెడ్డి పట్టణ కేంద్రంలోని ఐబీ సమీపంలో గురువారం ఉదయం ఫ్లెక్సీ నిర్వాహకుల నిర్లక్ష్యం వలన రహదారిలో ప్రయాణిస్తున్న వాహనదారి పై ఫ్లెక్సీ విరిగిపడిన క్రమంలో వాహనదారులు గాయాల పాలు కాగా స్థానికులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. సంగారెడ్డి పట్టణంలో పలు ప్రదేశాలలో ట్రాఫిక్ మూల మలుపుల వద్ద విచ్చలవిడిగా ప్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. అదే విధంగా ఐబీ వద్ద కూడా లోపలికి వాహనదారులు, పాదచారులు కూడా వెళ్లాలంటే దారి కనిపించకుండా ఏర్పాటు చేస్తున్నారు.

ఈ క్రమంలో గురువారం ఐబీ వద్ద ప్లె్క్సీల నిర్వాహకులు ఏర్పాటు చేస్తుండగా ప్రమాదవశాత్తు ప్లెక్సీ విరిగిపడి రోడ్డు పై వెల్తున్న వాహనదారుల పై పడింది. దీంతో పలువురికి గాయాలయ్యాయి. గాయాలపాలయిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పట్టణంలో ఎక్కడ పడితే అక్కడ ఎలాంటి అనుమతులు లేకుండా ప్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారని మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్ల వారి తప్పిదం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ఇప్పటికైన మూల మలుపుల వద్ద ప్లెక్సీలు ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకోవాలని పట్టణ వాసులు కోరుతున్నారు.


Similar News