ఆరోగ్యశ్రీని కోమాలో పెట్టి 'అనారోగ్యశ్రీ'గా మార్చారు : YS Sharmila

పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యాన్ని సంజీవనిలా ఆదుకునే ఆరోగ్య శ్రీని కోమాలో పెట్టి అనారోగ్యశ్రీగా

Update: 2023-07-19 16:46 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యాన్ని సంజీవనిలా ఆదుకునే ఆరోగ్య శ్రీని కోమాలో పెట్టి అనారోగ్యశ్రీగా ముఖ్య మంత్రి కేసీఆర్ మార్చారని వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. తొమ్మిదేండ్లుగా ఆరోగ్యశ్రీని అమలు చేయకుండా లక్షల మంది ప్రాణాలు తీసిన పాపం కేసీఆర్ దేనన్నారు. ఏటికేటా బిల్లులు చెల్లించక ఆరోగ్యశ్రీ పేరు చెప్తేనే కేసులు పట్టకుండా చేశారని ఆరోపించారు. ఆసుపత్రులకు పెండింగ్ బకాయిలు 800 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేసారు. కంటికి పంటికి జబ్బు చేస్తే ఢిల్లీకి, కార్పొరేట్ దవాఖానకు పరుగులు పెట్టే దొర.. పేదోడికి దక్కాల్సిన కార్పొరేట్ వైద్యాన్ని కిల్ చేశాడని అన్నారు.

ఉచిత వైద్యం అందిచాల్సిన సర్కారీ దవాఖానలకే పథకాన్ని పరిమితం చేసారని తెలిపారు. కరోనాలాంటి విపత్కర పరిస్థితిలోనూ బకాయిలు చెల్లించకుండా వేలాది మంది పేదల చావులకు ప్రత్యక్ష కారకుడు కేసీఆర్ అని అన్నారు. 2లక్షల నుంచి ప్రీమియాన్ని రూ.5 లక్షలకు పెంచిండు.. పని చేయని పథకానికి అంకెల్లో ప్రీమియం పెంచి ఏదో ఉద్దరించినట్లు ఇప్పుడు బిల్డప్పులు ఇస్తున్నరని ఇక నుండి మీ ఎన్నికల జిమ్మిక్కులు, నక్క తెలివితేటలు ఇప్పటికైనా పక్కన పెట్టాలని అన్నారు. తక్షణం ఆరోగ్యశ్రీని అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో అమలు చేయాలని ఇచ్చిన మాట ప్రకారమైనా 5 లక్షల ప్రీమియాన్ని ఆపకుండా అమలు చేయాలని డిమాండ్ చేసారు.

Tags:    

Similar News